మంత్రి మల్లారెడ్డితో మహిళ ఆడియో కాల్ లీక్.. ఆ సీక్రెట్ చెప్పాలంటూ..

-

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తనదైన స్టైల్ లో బోల్డ్ గా, లౌడ్ గా మాట్లాడుతూ ఆకట్టుకుంటారు మల్లారెడ్డి. మల్లారెడ్డి కాలేజీ ఈవెంట్లలోనే కాదు.. అసెంబ్లీ లోను ఆయన స్పీచ్ లు నవ్వులు పూయిస్తూ ఉంటాయి.

mallareddy

అయితే తాజాగా మంత్రి మల్లారెడ్డి ఓ మహిళతో ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఈమధ్య ఆయన ఎక్కడికి వెళ్లినా ఎలా ఫేమస్ అయ్యాను అనే దాని గురించే చెబుతున్నారు. ఆయన ఫేమస్ కావడానికి కారణం కష్టపడి వచ్చానని, పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు పెట్టినా, హాస్పిటల్స్ పెట్టినా.. కష్టపడి పైకి వచ్చానని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయనకి ఓ మహిళ ఫోన్ చేసి.. మీరు కోటీశ్వరులు ఎలా అయ్యారో చెప్పాలని అడిగింది. వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మీ వద్ద బోలెడు డబ్బు ఉందని చెప్పారు కదా..! అంత డబ్బు ఎలా వచ్చిందో మాకు కూడా చెప్పాలంటూ ఆ మహిళ ప్రశ్నించింది. దీనికి మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో జవాబులు ఇచ్చారు. పాలమ్మినా, పూలమ్మినా అంటూ మరోసారి చెప్పుకోచ్చారు మల్లారెడ్డి. అయితే తన వద్ద మీరు అనుకుంటున్నాంత డబ్బు లేదని.. కేవలం తన ఫ్యామిలీకి సరిపడా డబ్బు ఉందని.. ఆ లాజిక్ తర్వాత చెబుతానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version