పొంగులేటిపై రేవంత్ వల..ఖమ్మంలో బిగ్ స్కెచ్.!

-

కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం  తెలిసిందే. సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చ నడుస్తుంది. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది..అయినా సరే నేతలు వెనక్కి తగ్గడం లేదు. ఎవరికి వారు  తమ ఆధిపత్యం పెంచుకునేలా ముందుకెళుతున్నారు. తాజాగా కూడా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. నల్గొండలో నిరుద్యోగ నిరసన సభ పెట్టాలని రేవంత్ అనుకున్నారు..కానీ తన పార్లమెంట్ లో తనని సంప్రదించకుండా సభ పెట్టడం ఏంటని ఉత్తమ్ సీరియస్ అవుతూ..రేవంత్ పై రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ థాక్రేకు ఫిర్యాదు చేశారు. దీంతో నల్గొండలో జరిగే సభ వాయిదా పడింది.

ఈ క్రమంలో రేవంత్..ఖమ్మంపై ఫోకస్ పెట్టారు. ఈ  నెల 24న అక్కడ సభకు ప్లాన్ చేశారు. అక్కడ కీలక నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో రేవంత్..రేణుకా చౌదరీతో భేటీ అయ్యారు. అలాగే సభతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంశం కూడా మాట్లాడినట్లు తెలిసింది. ఇప్పటికే పొంగులేటి బి‌ఆర్‌ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి..జిల్లాలో తన వర్గాన్ని పెంచుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే.

అయితే జిల్లాలో బలం ఉన్న పొంగులేటిని చేర్చుకుంటే ఇంకా బలపడవచ్చు అనేది రేవంత్ ఐడియా..అదే సమయంలో తానే పొంగులేటిని చేర్చుకునే పనిలో ఉంటే..ఇంకా పార్టీపై తనకు పట్టు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే తనకు అనుకూలమైన నేతల చేత రేవంత్..పొంగులేటితో కాంటాక్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

అటు బి‌జే‌పి నేతలు కూడా పొంగులేటి కోసం ట్రై చేస్తున్నారు. కాకపోతే ఖమ్మంలో బి‌జే‌పికి బలం లేదు..దీంతో పొంగులేటి కాంగ్రెస్ లేదా షర్మిల పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. చూడాలి మరి పొంగులేటిని రేవంత్ కాంగ్రెస్ లోకి లాగుతారో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version