తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే

-

తెలంగాణలో బీజేపీని పటిష్ఠం చేసేందుకు.. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్ద దించేందుకు కమలదళం పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలు తరచూ రాష్ట్రానికి వస్తూ.. రాష్ట్ర నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం కోసం కృషి చేస్తున్నారు.

అయితే బీజేపీ నిర్వహిస్తున్న పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 23వ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ షా పర్యటన షెడ్యూల్ విడుదల చేసింది.

ఈనెల 23న మ.3.30 గం.కు శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు

మధ్యాహ్నం 3.50 గం.కు నోవాటెల్ హోటల్‌కు షా వెళ్తారు.

సాయంత్రం 4 గం.కు ఆస్కార్‌ విజేతలతో అమిత్‌షా తేనీటి విందు

ఎల్లుండి సా.5.15 గం.కు నోవాటెల్ నుంచి చేవెళ్లకు అమిత్ షా

ఎల్లుండి సా.6 గం.కు చేవెళ్ల సభలో పాల్గొననున్న అమిత్ షా

పార్లమెంటు ప్రవాస్ యోజనలో భాగంగా చేవెళ్ల సభలో పాల్గొననున్న అమిత్ షా

అనంతరం రాత్రి 7.50 గం.కు ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనం

Read more RELATED
Recommended to you

Exit mobile version