ఏపీలో పోలీసులకు పట్టిన గతే.. తెలంగాణ పోలీసులకు కూడా – బాల్క సుమన్‌

-

 

ఏపీలో పోలీసులకు పట్టిన గతే.. తెలంగాణ పోలీసులకు కూడా పడుతుందని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన కామెంట్స్ చేశారు. చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పక్కా గా వస్తాయని బాంబ్‌ పేల్చారు. సూటుకేస్ కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ జైలు పోవటం‌ ఖాయం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి…. ఎమ్మెల్యే వివేక్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపనలు చేశారు.

రేవంత్ రెడ్డి కాదు కదా.. భగవంతుడు కూడా వివేక్ ను కాపాడలేడని హెచ్చరించారు. ఈడీ కేసు జరుగుతుంటే‌.. తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహించారు. వివేక్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకు వెళ్తామని తెలిపారు. వివేక్‌‌.‌. అక్రమంగా వందల కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేశాడని మండిపడ్డారు. తెలంగాణ పోలీసులకు స్వామి భక్తి ఎక్కువైందని నిప్పులు చెరిగారు. పోలీసులు… రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వత్తుతున్నారని ఆగ్రహించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తోన్న పోలీసులు భవిష్యత్తులో బలికాక తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు. ఈడీ విచారణ జరుగుతోన్న కేసును పోలీసులు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version