తెలంగాణ సిఎమ్ రేవంత్ రెడ్డి కి మాజీ ఎమ్.పి కేవిపి బహిరంగ లేఖ రాయడం జరిగింది. మూసీ ప్రక్షాళన/ సుందరీకరణను నేను పూర్తిగా స్వాగతిస్తున్నానని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో అటు BRS, BJP నాయకులు, వారి పెంపుడు మీడియా పేదలకు అన్యాయం పేరుతో మాట్లాడేవి, చేస్తున్నవి.. అన్నీ వారి స్వప్రయోజనాలు కాపాడుకోవడం కోసమేనని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ప్రతిపక్షాలది మొసలికన్నీరే నని, దేశప్రజలందిరికి తెలుసు అని తెలిపారు.
మీ ఆశయాన్ని దెబ్బతీసే వారి ప్రయత్నాలను ఖండిస్తున్నానని… అజీజ్ నగర్ లో నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఫార్మ్ హౌస్ మీద, వారి స్వార్ధం కోసం, ప్రతిపక్ష నాయకులు పదేపదే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. మీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని, తద్వారా మిమ్మల్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నం అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మీపై, మన పార్టీపై, ఆధారాలు లేని ఆరోపణలు చేయడానికి, ప్రతిపక్షాలు నన్ను, నా కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న ఫార్మ్ హౌస్ ను పావుగా వాడుకోవడం, నాకు తీవ్ర మనోవేదన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. మా ఫార్మ్ హౌస్ లో ఏ కట్టడమూ, ఎఫ్‌టిఎల్ పరిధిలో గానీ, బఫర్ జోన్ పరిధిలో లేవని క్లారిటీ ఇచ్చారు. ఫార్మ్ హౌస్ లో ఏ కట్టడమైనా ఒక్క అంగుళం మేరకు ఎఫ్‌టిఎల్ , బఫర్ జోన్ పరిధిలో ఉన్నా, నా కుటుంబసభ్యులు స్వంత ఖర్చులతో కూల్చడానికి సిద్ధమని స్పష్టం చేశారు.