100 రోజులు అయిపోయాయి…6 గ్యారంటీలు ఎక్కడా ? అంటూ నిలదీశారు బండి సంజయ్. ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనని…మహిళలకు ప్రతినెలా రూ.2,500లు ఎందుకు జమ చేయడం లేదు? అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ది చెప్పండని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్.
‘‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన గడువు ఇయాళ్టితో ముగిసింది. కానీ వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసింది. ఎన్నికల హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది. ఎందుకు అమలు చేయలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
‘‘వంద రోజుల్లోనే మహిళలకు ప్రతినెలా రూ.2500 లు ఇస్తామని మోసం చేశారు. రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ.15వేలు ఇస్తామని ఇయ్యనేలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇయ్యలేదు. వ్రుద్దులు, వితంతవులకు చేయూత కింద రూ.4 వేలు ఇస్తామని మోసం చేశారు… మరి మీకెందుకు ఓటేయాలి’’అని ప్రశ్నించారు బండి సంజయ్ కుమార్..