తెలంగాణలో RK బ్రదర్స్‌ పాలన నడుస్తోంది – బండి సంజయ్‌

-

తెలంగాణలో RK బ్రదర్స్‌ పాలన నడుస్తోందని బాంబ్‌ పేల్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇవాళ సంగారెడ్డి లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ… ఢిల్లీలో సెటిల్ మెంట్….. కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి అన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కాం కేసులన్నీ గాలికే అంటూ చురకలు అంటించారు. కలెక్టర్ పై దాడి సూత్రధారి కేటీఆర్ అని తేలినా అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటు అంటూ ఆగ్రహించారు.

bandi sanjay, KCR, revanth

కేటీఆర్ ను అరెస్ట్ చేయకపోవడం సర్కార్ చేతగానితనమే అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ కే బ్రదర్స్ పాలన నడుస్తోంది… కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయన్నారు. నేను నిరూపిస్తా….కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? అంటూ సవాల్‌ చేశారు. నాకు, రేవంత్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా? అంటూ రెచ్చిపోయారు.

రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకే దాడులు తెరపైకి తెచ్చారన్నారు. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ… దాడులతో ప్రజల ప్రాణాలాతో చెలగాటాలాడుతోందని ఫైర్‌ అయ్యారు. గ్రూప్ 1, కానిస్టేబుల్ ఆందోళనలోనూ బీఆర్ఎస్ విధ్వంసం చేయాలనుకుందని నిప్పులు చెరిగారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version