ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా హుస్సేన్ సాగర్ లోనే గణేశ్ నిమజ్జనం చేద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధర్నాలు, దీక్షలు చేస్తే తప్ప ఈ ప్రభుత్వం ప్రజల మంచికి సంబంధించి నిర్ణయాలు తీసుకోదని విమర్శించారు. ఎట్టకేలకు.. భాగ్యనగర్ ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చిన ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై క్రేన్‌లు ఏర్పాట్లు చేస్తుందని అన్నారు.
సచివాలయ సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను బండి సంజయ్ పరిశీలించారు. మంత్రుల అబద్దాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటి వరకూ తూతూ మంత్రంగానే ఏర్పాట్లు జరుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. వినాయక నిమజ్జనానికి రెండ్రోజులే గడువు ఉన్నా ప్రభుత్వం కనీస ఏర్పాట్లు చేయట్లేదని మండిపడ్డారు.