రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో కేసీఆర్ ఫెయిల్ – బండి సంజయ్

-

రేషన్ డీలర్ల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహించారు బండి సంజయ్‌. ఏళ్ల తరబడి వాళ్ల సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గు చేటు. రేషన్ డీలర్లను పిలిచి మాట్లాడే తీరిక ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. మే 22న సమ్మె నోటీస్ ఇచ్చిన తరువాత వాళ్ల సమస్యలన్నీ పరిష్కారిస్తామని, ఈ మేరకు జూన్ ఫస్ట్ న జీవోలను విడుదల చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ ఒక్క జీవో కూడా విడుదల చేయకపోవడం సిగ్గు చేటు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడంవల్లే రేషన్ డీలర్లు సమ్మె చేయాల్సి వచ్చందని తెలిపారు. రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేద ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. పేదలకు బియ్యం అందించలేని దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు రేషన్ నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నా వాటిని పేదలకు అందించకుండా కేసీఆర్ ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందన్నారు. రేషన్ డీలర్లు కోవిడ్ టైంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేశారు. ఏ ఒక్కరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో నరేంద్రమోద ప్రభుత్వం దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం కేటాయిస్తే…. తెలంగాణలో పేదలందరికీ రేషన్ డీలర్లు బియ్యం అందిస్తూ సేవలందించారని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version