కాంగ్రెస్ లో BRS విలీనం… ఢిల్లీలో ఒప్పందం..!

-

బీజేపీలో చేరి, పార్టీకి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్, BRS లు దొంగ నాటకాలు ఆడుతున్నాయి. తెలంగాణ సమాజానికి పూర్తిగా స్పష్టత వచ్చింది .. కాంగ్రెస్ లో BRS విలీనం కాబోతుంది అని సభ్యత్వ నమోదు వర్క్ షాప్ లో బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి.. కేసీఆర్ కూతురు బెయిల్ కోసం వాదనలు వినిపించిన వ్యక్తి. కేసీఆర్ సూచనల మేరకే ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించారు. BRS రాజ్యసభకు ఎందుకు పోటీ చేయడం లేదు… మాకు 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే పోటీ చేసే వాళ్లము అని బండి తెలిపాడు.

కాంగ్రెస్ అభ్యర్థి.. BRS, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి. కాంగ్రెస్ లో కేసీఆర్ ఆడిందే అట పాడిందే పాట. అతి త్వరలోనే కాంగ్రెస్ లో BRS విలీనం ఖాయం. ఢిల్లీలో ఒప్పందం కూడా జరిగింది అన్నారు. కానీ ప్లాన్ ప్రకారం బీజేపీ నీ బ్లేమ్ చేస్తున్నారు. అలాగే విగ్రహాల దందా బంద్ చేయాలి. సమస్యలను డైవర్ట్ చేయడానికి విగ్రహాల రాజకీయాల చర్చ చేస్తున్నారు అని బండి సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version