కనీసం ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుడు సీఎం కేసీఆర్ -బండి సంజయ్

-

Pv ఘాట్ లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నివాలుల అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై బండి సంజయ్ విమర్శలు చేశారు. ఎన్నికలు వస్తేనే కెసిఆర్ కి వర్ధంతి జయంతి లు గుర్తుకు వస్తాయని…అవసరం ఉంటే కాళ్ళు..లేదంటే జుట్టు పట్టుకుంటారు అని కెసిఆర్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు బండి సంజయ్ కుమార్.

కనీసం ఇంగిత జ్ఞానం లేని ముర్కుడు కెసిఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. Pv కుటుంబం నీ రాజకీయం కోసమే వాడుకుంటున్నారని కెసిఆర్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ pv నీ అవమాన పరిచారు…కనీసం శవాన్ని కూడా కాల్చ కుండా చేసింది కాంగ్రెస్ అని నిప్పులు చెరిగారు. Pv నీ కాంగ్రెస్ నాయకుడు అని కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మంచి భవిష్యత్తు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి బీటలు రావడం ఖాయమని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version