కవిత బెయిల్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. స్పందించిన కేటీఆర్

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 6 నెలల పాటు జైలులో ఉన్న  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇవాళ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.  కవిత బెయిల్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయమంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ లాయర్ చేసిన కృషితోనే ఒకరికీ బెయిల్ వస్తే.. బీఆర్ఎస్ సపోర్టు కారణంగా లాయర్ రాజ్యసభలో స్థానం పొందారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసారు. వైన్ అండ్ డ్రైన్ క్రైమ్ లో పార్టనర్స్ అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కంగ్రాట్స్ అంటూ ఆయన స్థాయిని మరిచి సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ చేశారని మండిపడ్డారు కేటీఆర్. కేంద్ర మంత్రిగా ఉంటూ ఇంత చౌకబారుగా మాట్లాడతారా..? అని విమర్శించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ కి విజ్ఞప్తి చేశారు కేటీఆర్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version