గడీల రాజ్యం కావాలా ? గరీబోళ్ల రాజ్యం కావాలా ? : బండి సంజయ్

-

ప్రజలారా…. గడీల రాజ్యం కావాలా ? గరీబోళ్ల రాజ్యం కావాలా ? ఆలోచించండని బండి సంజయ్ కోరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 10 వరోజు ఎల్లంపల్లిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఛీటర్, దగుల్బాజీ ఏలుతున్నడని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాల భర్తీ సహా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని… గడీల పాలనతో గోస పెడుతున్నాడని మండిపడ్డారు.

గడీల పాలనను బద్దలు కొట్టి గరీబోళ్ల రాజ్యం తీసుకొచ్చే పార్టీ బీజేపీ మాత్రమేనని… 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తానన్న కేసీఆర్ 7 గంటల కూడా వ్యవసాయానికి కరెంట్ ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ఫాంహౌజ్ కు ఖర్చయ్యే కరెంట్ తో 10 గ్రామాలకు సరిపడా విద్యుత్ ను సరఫరా చేయొచ్చు… ఒక్కో మంత్రి ఫాంహౌజ్ కు 25 కనెక్షన్లున్నాయని తెలిపారు.

పెద్ద ఎత్తున ఉచితంగా కరెంట్ ను వాడుకుంటున్నారు. కానీ, మరోవైపు కరెంట్ ఛార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. వచ్చే నెల నుండి కరెంట్ బిల్లులను చూస్తే షాక్ తగిలే అవకాశం ఉంది. ఇప్పుడొసున్న బిల్లు కంటే రెట్టింపు రాబోతోందని తెలిపారు. గడీల పాలన చేస్తూ ప్రజలను దోచుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతరేయాల్సిన అవసరం ఉందని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version