భద్రాచలంలో భారీ వర్షం.. వరదనీటిలో రామాలయం

-

రాష్ట్రంలో మళ్లీ వర్షం కురుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం వద్దకు భారీగా వరదనీరు చేరింది. అన్నదాన సత్రం పక్కనే ఉన్న డ్రైనేజీ పొంగిపొర్లి పడమర మెట్ల వైపు మోకాలు లోతు నీరు చేరడంతో భక్తులు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది.

కరకట్ట వద్ద లూయిస్‌ను మూసి ఉండటంతో వర్షపునీరు డ్రైనేజీ గుండా గోదావరిలో కలవకుండా కాంప్లెక్స్‌లో వర్షపునీటితో పాటు మురుగు చేరింది. కరకట్ట విస్తా కాంప్లెక్స్ వద్ద ఉన్న మోటార్లతో మురుగునీటిని ఎత్తిపోస్తున్నారు. సమీపంలోని దుకాణాల్లోకి వర్షపునీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లోని ఇంద్రావతి వైపు నుంచి వరద చేరడంతో ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో నీటమట్టం పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version