భయ్యా సన్నీ యాదవ్ కు సజ్జనర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్ !

-

భయ్యా సన్నీ యాదవ్ కు సజ్జనర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో!! అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట!! అంటూ భయ్యా సన్నీ యాదవ్ వీడియోను షేర్‌ చేశారు సజ్జనార్‌. ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండి!!? అంటూ ప్రశ్నించారు.

Bhaiyya Sunny Yadav has a strong warning

ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారని ఆగ్రహించారు. మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడ ధోరణి సరైంది కాదన్నారు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండి అని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news