కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

-

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ప్రచారం వేళ బండి సంజయ్‌పై కేసు నమోదు అయ్యింది.కార్యకర్తల భేటీలో భాగంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని కొందరు వ్యక్తులు ఆయనపై ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి,చార్జిషీట్ కూడా దాఖలు చేశారు.

దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరగగా బండి తరఫు లాయర్ వాదిస్తూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని, కేవలం అభియోగం మోపి కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు.దీంతో ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్న కారణంతో కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news