తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద సోషల్ మీడియా, యూట్యూబ్ చానెళ్లలో అసభ్య పదజాలంతో దూషించడంతో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట అలాంటివి సహించబోనని, ఎవరైనా అసభ్యంగా దూషిస్తే బట్టలూడదీసి కొడతామని అసెంబ్లీ వేదికగా హెచ్చరించారు.
తాజాగా ఆయన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కౌంటర్ ఇచ్చారు. ‘రేవంత్ రెడ్డి నువ్వు అందరి బట్టలు ఊడదీసి కొట్టుడు కాదు, వచ్చే ఎన్నికల్లో ప్రజలే నీ బట్టలు ఊడదీసి కొడ్తరు.2009లో గుర్నాథ్ రెడ్డి రేవంత్ రెడ్డిని గుడ్డలు ఊడదీసి కొట్టిండు, అది గుర్తొచ్చి రేవంత్ రెడ్డి ఇప్పుడు అందరి గుడ్డలు ఊడదీస్తా అంటున్నాడు’ అని గాదరి కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు.