తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు బిగ్ షాక్. మూడేళ్లు ఉన్న డిగ్రీ విద్యను నాలుగేళ్లు చేసేందుకు, తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్లాన్ చేస్తోంది. మూస పద్ధతికి స్వస్తి చెప్పి ఎగ్జామినేషన్, ఎవల్యూషన్ అలాగే అసైన్మెంట్లలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది.
అలాగే కాలేజీలలో వసతులు పెంచాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 లోపు రిపోర్టు చేయాలని ఐఎస్బి కి ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు చేయాలని చెప్పింది. ఎన్ అండ్ పేపర్ విధానానికి ప్రాధాన్యత తగ్గించాలని పేర్కొంది. ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చే విధంగా ఎంపవర్మెంట్ సాధించే దిశగా అడుగులు వేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి.