ఉమ్మడి మెదక్ జిల్లాలో బర్డ్ ఫ్లూ టెన్షన్ నెలకొంది. మొన్నటి వరకు ఏపీలో బర్డ్ ఫ్లూ టెన్షన్ ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బర్డ్ ఫ్లూ టెన్షన్ నెలకొంది. దీంతో వందల సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయని అంటున్నారు. కొన్ని రోజులుగా పౌల్ట్రీఫారాల్లో వరుసగా మృత్యువాత పడుతున్నాయి కోళ్లు.

ఉమ్మడి మెదక్ జిల్లా శివంపేట (మం)గూడూరు తండాలో కోళ్లు మృత్యువాత పడి మూడు రోజుల్లో కోళ్ల ఫామ్ ఖాళీ అయింది. మృతి చెందిన కోళ్లను గుంత తీసి పూడ్చారట కోళ్లఫారం యజమాని. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో వేలాదిగా మృత్యువాత పడుతున్నాయి కోళ్లు. ఇప్పటికే కొన్ని శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపారు పశువైద్యాధికారులు. ఇక ఈ సంఘటన నేపథ్యంలో ఉ మ్మడి మెదక్ జిల్లాలో చికెన్ తినాలంటే భయపడిపోతున్నారు జనాలు.