ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందంగా.. హైదరాబాద్ లో వర్షాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. గ్యాప్ ఇస్తూ మరీ వరణుడు నగరవాసులన్ని వణికించేస్తున్నాడు. నగరంలోని జూబ్లీ హిల్స్, కూకట్‌పల్ల, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, అమీర్‌పేట్, తార్నాక, చింతలబస్తీ, సోమాజిగూడ, కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్, మాదాపూర్, ఉప్పల్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్‌లో వర్షం పడుతోంది.
ఉదయాన్నే పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు వెళ్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద భారీగా వాన నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇది ఇలా ఉండగా.. హైదరాబాద్ కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఏరియాలోని బిర్యానీ హండీలు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మళ్లీ గతంలో లాగే వరదలు వస్తున్నాయని, ఇలా హండీలు కొట్టుకుపోతే.. బిర్యానీ ఎలా తింటామని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
#HeavyRains all over #Hyderabad #Biryani, including handi, washed away in the #rain #Hyderabad #HyderabadRains @Hyderabadrains #TelanganaRains @HiHyderabad @WeatherRadar_IN @SkymetWeather
@weatherindia @HydWatch @HYDmeterologist
@TS_AP_Weather @Hyderabad_Bot pic.twitter.com/SI5p0rXB9b— Harish Deshmukh (@DeshmukhHarish9) August 1, 2022