మేఘా కృష్ణారెడ్డి కంపెనీని బ్లాక్‌ లిస్ట్‌ లో పెట్టాలి – సుంకిశాలపై ఏలేటి సంచలన వ్యాఖ్యలు

-

మేఘా కృష్ణ రెడ్డి పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారిన పెత్తనం మాత్రం మేఘ కృష్ణ రెడ్డిదని… గవర్నమెంట్ మారిన కాంట్రాక్టర్ మారలేదన్నారు. నాసిరకం పనులు చేసిన ఆయనకే కాంటాక్ట్స్ ఇస్తున్నారు…ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహించారు. గతంలో ఉన్న టెండర్ ను ఎస్కలెట్ చేయడం మేఘ పాత్ర ఉందని… సుంకి శాల కూలి పది రోజులు అయిన ప్రభుత్వం దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు.

BJLP leader Alleti Maheshwar Reddy Sensational comments on Megha Krishna Reddy

వచ్చిన మేఘ ను కాపాడుకునేందుకు విషయాన్ని దాచారా? నాసిరకం పనులు చేసి గుత్తేదార్లను కాపాడుతున్నారని రేవంత్‌ సర్కార్‌పై మండిపడ్డారు. మేఘ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని…. గతంలో సుంకిశాల అంచనా వ్యయం 8 వందల కోట్ల అంచనాకు పెంచారని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ వచ్చాక 4 వేల కోట్ల అంచనా వ్యయం మరోసారి పెంచారని ఆరోపణలు చేశారు.

క్రిమినల్ కాంట్రాక్టర్ల కు వేల కోట్లు దోచి పెడుతున్నారని… నాయకులు అంత కలిసి మేఘ కృష్ణా రెడ్డికి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. మేఘ మీద చర్యలు ఎందుకు లేవు ? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా మేఘ మీద పీసీసీ రేవంత్ ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతిని సీబీఐ కి సిఫార్సు చేయడం లేదని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version