సెప్టెంబర్ 17 నుంచి బీజేపీ బస్సు యాత్ర

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ప్రభావం ఉండేలా బస్సు యాత్ర చేపట్టేందుకు బీజేపీ సమాయత్తమైంది. సెప్టెంబరు నెల అంతా నేతలు పూర్తిస్థాయిలో పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతలకు సూచించారు. ఇందులో బస్సు యాత్ర కీలకమైనదిగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేసి.. అక్టోబరు రెండో తేదీలోపు పూర్తిచేయాలని నిర్ణయించారు.

సెప్టెంబరు 17 నుంచి రాష్ట్ర మూడు వైపులా ముగ్గురు రాష్ట్ర నేతలు బస్సు యాత్రను ఏకకాలంలో ప్రారంభించాలని కిషన్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి మూడు మార్గాలపై అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ముగ్గురు అగ్రనేతల సారథ్యంలో వీటిని పూర్తిచేయాలని నిర్ణయించారు.

పూర్వపు జిల్లాల ఆధారంగా రూట్లను ఖారారు చేసినట్లు సమాచారం. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లాలను కలుపుతూ కుమురంభీం మార్గం.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలను కలుపుతూ కృష్ణా మార్గం.. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలను కలుపుతూ గోదావరి మార్గంలో బస్సుయాత్ర చేపట్టేందుకు నిర్ణయించారు. రాష్ట్రస్థాయిలో బస్సు యాత్రను పర్యవేక్షించేందుకు 12 మందితో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. జాతీయ నాయకులు బస్సుయాత్రలో భాగస్వామ్యం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version