కొత్త ఓట్ల నమోదుపై బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక ప్రకటన

-

కొత్త ఓట్ల నమోదుపై బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. “మేరా బూత్, సబ్‌సే మజ్‌బూత్” కార్యక్రమంలో భాగంగా కాచిగూడ భూమన్న గల్లీ లోని పలు అపార్ట్మెంట్ లో పోలింగ్ బూత్ లో ఓటర్ వెరిఫికేషన్ & ఎన్‌రోల్‌మెంట్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్థానిక ఓటర్లకు ఎన్‌రోల్‌మెంట్‌ పై, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ప్రతి బూతువారీగా బూతు లెవెల్స్ ఆఫీసర్స్‌ను పంపించే కార్యక్రమం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.ఓటరు లిస్టులో నమోదు సంబంధిత దరఖాస్తు ఫారాలు, అడ్రస్ మార్పు, యువ ఓటర్ల నమోదు తదితర సేవలను వినియోగించుకోవచ్చని కిషన్ రెడ్డి చెప్పారు.ఓటరు లిస్టులో తప్పులు సరిదిద్దుకోవడంతో పాటు 18 ఏళ్లు పైబడిన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. తనకు ఓటు హక్కు కలిగిన బర్కత్‌పురా పోలింగ్ బూత్‌లోని కొన్ని బస్తీలు, కాలనీ ప్రజల్లో తాను కూడా ఈ రోజు అవేర్‌నెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.దాంట్లో భాగంగానే తాను ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాల్సిందిగా సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version