Asia Cup 2023 : మళ్లీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్!

-

నిన్న భారత్ – పాక్ మ్యాచ్ రద్దు అయిందని ఫ్యాన్స్ నిరాశ చందనక్కర్లేదు. దాయాది జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది. గ్రూప్-Aలో పాకిస్తాన్, భారత్, నేపాల్ ఉండగా… పాక్ సూపర్-4కు చేరింది. పసికూన నేపాల్ పై భారత్ విజయం లాంఛనమే కాబట్టి మనం కూడా సూపర్-4కు వెళ్తాం.

ind vs pak

సూపర్-4లో ఒక జట్టు 3 మ్యాచులు (సేమ్ గ్రూపులోని మరో టీం పై, మరో గ్రూపులోని 2 టీంలతో) ఆడుతుంది. కాబట్టి సెప్టెంబర్ 10న పాకిస్తాన్ – భారత్ మ్యాచ్ ఉండొచ్చు.

కాగా, ఆసియా కప్ లో భాగంగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ తో బంగ్లాదేశ్ తలపడనుంది. తొలి మ్యాచులో శ్రీలంక చేతిలో ఓడిన బంగ్లా ఈ మ్యాచ్ లో గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే గ్రూప్-బిలో సూపర్-4కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఆఫ్గాన్ ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది. లాహోర్ గడాఫీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version