అమిత్ షా రాకతో ప్రగతి భవన్ పీఠాలు కదులుతున్నాయని జాతీయ ఓబీసి మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ గోడలు బీటలు పడుతున్నాయని… అది ఓర్వలేక ట్విట్టర్ పిట్ట యువరాజు 27 ప్రశ్నలు సంధించారు… వీటన్నింటికి అమిత్ షా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ అవినీతిలో, అక్రమ సంపాదన, అబద్దాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా టీఆర్ఎస్ పాలన కొనసాగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ నుంచి గోవా వరకు రూ. 2500 పింఛన్లు ప్రకటించామని ఆయన అన్నారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు రావణుడిగా మారారని… బీజేపీ కార్యకర్తలు హనుమంతులుగా మారి లంక దహనం చేసిన విధంగా మీ పాలనను అంతం చేస్తారని అన్నారు. గడీల రాజ్యానికి అంతం పలుకుతామని అన్నారు. నిజాం తరహా పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ పాలన సాగిస్తుందని… అమిత్ షా పాలనకు చరమగీతం పాడుతారని ఆయన అన్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చిన బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనను దించి డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే అని లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం, దారుస్సలాం కు దాసోహం అంటుందని విమర్శించారు.