వ్యక్తిగత ఇష్టాలతో కాకుండా హైడ్రా చట్టం ప్రకారం నడుచుకోవాలి..!

-

హైడ్రాపై సమావేశం అయ్యారు బీజేపీ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల బీజేపీ అధ్యక్షులు, నేతలు. సమావేశం అనంతరం రంగారెడ్డి బీజేపీ అధ్యక్షులు బొక్క నర్శిహ్మ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ఉన్న చెరువుల డేటా ప్రభుత్వానికి అప్పజెప్పుతాం, వాటిపైన చర్యలు తీసుకుoటారా అని ప్రశ్నించారు. నగరంలో ఎన్నో చెరువులు కబ్జాలకు గురయ్యాయి. చెరువులపై మాకు సమగ్రమైన అవగాహన, స్పష్టత ఉంది. సమగ్రమైన రిపోర్ట్ ప్రభుత్వానికి, హైడ్రా కు అందిస్తాం. హైడ్రా చిత్తశుద్ధితో పని చేయాలి. పేద ప్రజల ఇండ్లను కూల్చేతప్పుడు వారికి న్యాయం చేసిన తరువాత కూల్చడం మొదలు పెట్టాలి అని అన్నారు.

అలాగే మేడ్చల్ రూరల్ బీజేపీ అధ్యక్షులు విక్రమ్ మాట్లాడుతూ.. హైడ్రా వ్యక్తిగత ఇష్టా ఇష్టాలకు కాకుండా, చట్టం ప్రకారం సమానంగా ముందుకు వెళ్లాలి. గత బీఆర్ఎస్ పాలన తరహాలో కాకుండా చిత్తశుద్ధితో రేవంత్ సర్కార్ పని చేయాలి. పేద, మధ్య తరగతి కుటుంబాలు నగరంలో ప్రవైట్ సెక్టారులో కొని, చాలా ఏరియాలో ఇండ్లు నిర్మించుకున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. చెరువులను ప్రోటక్షన్ చేయడంలో తప్పులేదు, కానీ కొన్నింటిని టార్గెట్ చేసి, కూల్చి, మిగితా వాటిని కూల్చకుండ ఉంటే మాత్రం ఊరుకునేది లేదు. హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చడంలో పార్షాలిటి చూయిస్తే బీజేపీ పోరాటాలకు సిద్దంవుతుందని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version