బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చిహ్నంలో అమరవీరుల స్థూపం పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం.. అభ్యంతరం లేదు… చిహ్నంలో చార్మినార్ ను తొలగించే దమ్ము, ధైర్యం మీకుందా ? అని ప్రశ్నించారు. ముస్లీంల పాలకుల చిహ్నాలు.. ఆనవాళ్లు చాలా ఉన్నాయి… బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తొలగిస్తామని హెచ్చరించారు. చార్మినార్ ను లోగో నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నాం… కాకతీయ తోరణం లోగో నుంచి తీసివేయాలని అనుకోవడం శోచనీయం అన్నారు. కాకతీయ తోరణం తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉండాల్సిందేనన్నారు.
ఎదులాపురం పేరును అదిలాబాద్ గా రాజరికం పేరు పెట్టారు… సికింద్రాబాద్ ను లష్కర్ గా, మహబూబ్ నగర్ ను పాలమూరు గా, నిజామాబాద్ ను ఇందూరుగా ఎందుకు మార్చడం లేదు ?సాంస్కృతిక పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. తెలంగాణ కొత్త సచివాలయంలో 34 గుమ్మటాలు ఒవైసీ ఆనందం కోసం నిర్మించారు.. వాటిని ఎందుకు తొలగించడం లేదు ? రాజరికం అనవాళ్ళు మీకు కనిపించడం లేదా ? తెలంగాణ ఉద్యమ కారులకు 25 వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు ? అని నిలదీశారు. బలిదేవతకు రేవంత్ రెడ్డి భక్తుడిగా మారాడు… బీజేపీ మద్దతుతోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి బీజేపీ నేతలను పిలిస్తే బాగుండేదన్నారు.