తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. జూన్ 10 వరకు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. ఏపీలో జూన్ 02న.. తెలంగాణలో జూన్ 10 నుంచి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా.. జూన్ 01 నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. దీంతో అధిక ఉష్ణోగ్రత నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.
ఏపీలో రేపటి నుంచి వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాలో వడగాలులు వీస్తాయి.. అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. నైరుతి రుతుపవనాల కదళికతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అన్నీ కుదిరితే జూన్ మొదటివారంలోనే రాయలసీమలోకి రుతుపవానాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.