రేవంత్ రెడ్డి తమ్ముడి, కాంగ్రెస్ నాయకుల నిర్మాణాలను కూల్చే దమ్ము మీకుందా? – ఏలేటి

-

నిర్మల్ ఎమ్మెల్యే, BJLP నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి హైడ్రా డ్రామాలు చేస్తున్నాడని.. ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి వాళ్ల తమ్ముడి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల, పార్టీ నాయకుల అక్రమ నిర్మాణాలను కూల్చే దమ్ము మీకుందా? అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు…ఇచ్చిన హామీలు పక్కన పెట్టి హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సంచలనం చేస్తున్నారని ఆగ్రహించారు.

BJP MLA Eleti Maheshwar Reddy

దానం నాగేందర్ పై హై డ్రా కేసు నమోదు చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిప్పులు చెరిగారు. ఎప్పుడు ఏదో ఒక సంచలనం చేయడమే రేవంత్ రెడ్డి పని అని… ముందు మీ పార్టీ నేతల నుంచే కూల్చివేతలు మొదలవుతే మంచిది…ఆ దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ తో కట్టుకుని నష్టపోయిన వారికి ఎటువంటి హామీ ఇస్తున్నారని ఆగ్రహించారు. ఒకరిద్దరు సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చి చేస్తున్న అలజడి కేవలం దైవర్ట్ పాలిటిక్స్ కోసమేనన్నారు. రుణమాఫీ అంశాన్ని పక్కదోవ పట్టించడానికే హైడ్రాని హైప్ చేస్తున్నారని ఆగ్రహంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version