బాలయ్యకు షాక్‌…హిందూపురం జిల్లా ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు !

-

బాలయ్యకు షాక్‌…హిందూపురం జిల్లా ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తిలో బిజెపి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు రాష్ట్ర కో కన్వీనర్ మధుకర్ జీ. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసి పుట్టపర్తి జిల్లా కేంద్రం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. హిందూపురం జిల్లా కేంద్రం చేయాలన్న ఎంఎల్ఏ బాలకృష్ణ వ్యాఖ్యలను మనం వక్రీకరించాల్సిన అవసరం లేదన్నారు. హిందూపురం జిల్లా కేంద్రం కావాలని కొందరు కోరుకుంటున్నారని తెలిపారు.

BJP State Vice President Vishnuvardhan Reddy comments

రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తానని బాలకృష్ణ చెప్పారన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సత్యసాయి భక్తుల మనోభావాలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారని నేను భావిస్తున్నానని పేర్కొన్నారు. కచ్చితంగా పుట్టపర్తి కేంద్రంగానే శ్రీ సత్య సాయి జిల్లాగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తి అభివృద్ధికి పాటుపడుతుందని నేను ఆశిస్తున్నానని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version