రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ అమలులో విఫలం అయ్యారు అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీసే కర్తవ్యాలు మాకు ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సూటి ప్రశ్న. ఎన్నికల హామీలను నెరవేర్చటం లో ఎందుకు జాప్యం. ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయింది..రేవంత్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కొత్త పెన్షల మాట దేవుడు ఎరుగు,ఉన్న పెన్షన్ లు పికేస్తున్నారు. మూసి ప్రక్షాళన కోసం లక్ష కోట్లు అనేది హాస్య పదం. మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అనే రకంగా ఉంది అని ఎంపీ ఈటల తెలిపారు.
ఇక ప్రజల దృష్టి మరల్చి ప్రయత్నాలు మానుకోండి. హైడ్రా సమస్య,మూసి ప్రక్షాళన పై పోరాటం చేస్తాము. జీవో 29 దుర్మార్గమైన జీవో.దీన్ని సవరించాలి. రాజ్యాంగ బద్ధంగా జీవో లను అమలు చేయాలి. బండి సంజయ్ ర్యాలీ నీ అడ్డుకోవటన్ని ఖండిస్తున్నాం. గ్రూప్ వన్ అభ్యర్థుల కోరిక మేరకు పరీక్షలు వాయిదా వేయలి. 50 శాతం రిజర్వేషన్ మెరిట్ ప్రకారం కేటాయించాలి అని ఎంపీ ఈటల పేర్కొన్నారు.