తమిళనాడు లోని చెన్నై వేదికగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో అఖిల పక్ష సమావేశం జరిగిన విషయం విధితమే. తాజాగా ఈ సమావేశం పై తెలంగాణ బీజేపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టాలిన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే సమావేశం జరిగిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే స్టాలిన్ కొత్త ఎత్తుగడ ప్రారంభించారని.. అందులో ఇతర రాష్ట్రాల నేతలను కూడా ఇన్వాల్స్ చేసి వాడుకుంటున్నారన్నారు.
దక్షిణాదిన బలపడుతున్నదనే బీజేపీ పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చెన్నై వేదిక గా కాంగ్రెస్- బీఆర్ఎస్ రహస్య ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. డీలిమిటేషన్ కావాలనే రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 2026 వరకు డీలిమిటేసన్ పై ఫ్రీజ్ ఉందని గుర్తు ేశారు. దక్షిణాది బీజేపీ అన్యాయం చేయదు అని హామి ఇచ్చారు.