బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదు.. ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

-

తెలంగాణలో రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ను ఓ వైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య కూడా ఇలాగే సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్-బండి సంజయ్ మధ్య అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. నిత్యం ఏదో ఒక సందర్భంలో విమర్శలు చేసుకుంటూనే ఉంటారు.

ఇక మరోవైపు  బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదని మెదక్  ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని.. కేటీఆర్ రేవ్ పార్టీలని తిరుగు- తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుక్క తోక పటాకులు పేలుతాయా లేక సూతిల్ బాంబులు పేలుతాయో చూడాలన్నారు. అవినీతి పరులను అరెస్ట్ చేస్తే స్వాగతిస్తామన్నారు. ఆరు నెలల కింద కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 వందల కోట్లు విడుదల
చేసిందన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version