కోమటిరెడ్డి బ్రదర్స్ తో నాకు ప్రాణం ఉంది..హత్యకు కుట్ర చేస్తున్నారు – చిరుమర్తి

-

కోమటిరెడ్డి బ్రదర్స్ తో నాకు ప్రాణం ఉంది… ప్రజలే నన్ను కాపాడుకుంటారని చిరుమర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిరేకల్ నియోజకవర్గం నోముల గ్రామములో ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పై చిరుమర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ బ్రోకర్లు అని.. ప్రజలు కోమటిరెడ్డి బ్రదర్స్ కు సమాధి కడతారని ఫైర్‌ అయ్యారు. నకిరేకల్ నియోజకవర్గంలో నాయకులను డబ్బులతో కొంటున్నారు…నన్ను హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

Brs Chirumarthi Lingaiah comments on komatireddy brothers

కోమటిరెడ్డి బ్రదర్స్ తో నాకు ప్రాణం ఉంది… ప్రజలే నన్ను కాపాడుకుంటారు…ఇంటెలిజెంట్స్ రిపోర్టు తో ప్రభుత్వం మాకు సెక్యూరిటీని పెంచిందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటమి కోసం నల్లగొండ, మునుగోడులో ప్రచారం చేస్తానని ప్రకటించారు. మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి శ్రీనును వేముల వీరేశం, కోమటిరెడ్డి బ్రదర్స్ కలిసే హత్య చేశారు…2014లో నేను ఓడిపోవడానికి కారణం కోమటిరెడ్డి బ్రదర్స్ అంటూ ఆరోపించారు. నాకు మంత్రి పదవి వస్తుంది అనే భయం తో నన్ను గతంలో ఓడించారు…దళితుల్ని కాబట్టే నాపై ఓర్వలేక నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news