బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కదారి పట్టించింది – కేంద్రమంత్రి

-

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో వర్షాల వల్ల ఏర్పడ్డ నష్టాన్ని అంచనా వేసేందుకు వరద ప్రభావిత ప్రాంతాలలో శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి పర్యటించారు. మున్నేరు ఉధృతికి ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.

ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాలలో కేంద్ర మంత్రులు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తరఫున వరద బాధితులకు అండగా నిలుస్తామని, వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

తాను రాజకీయాలు చేసేందుకు ఇక్కడికి రాలేదని.. రైతులను ఆదుకునేందుకే వచ్చానన్నారు. తాను కూడా రైతునేనని.. రైతుల కష్టాలు తనకు బాగా తెలుసన్నారు. వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని.. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు కేంద్రమంత్రి. ఈసారి అలా జరగకుండా చూస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version