తెలంగాణ రైతన్నలకు బిగ్ అలర్ఠ్. రైతుబంధు నిధులే రుణ మాఫీ కోసం మళ్లిస్తున్నారని బీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తోంది. గత ప్రభుత్వంలో ఇచ్చినట్లు ఎకరానికి రూ. 5000 చొప్పున ఒక విడతకు రైతుబంధు కోసం ఇచ్చే మొత్తం రూ. 7,400 కోట్లు అని బీఆర్‌ఎస్ పార్టీ తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఎకరానికి రూ. 7500 చొప్పున ఒక విడతకు రైతుబంధు కోసం ఇవ్వాలంటే అయ్యే మొత్తం రూ. 11,100 కోట్లుగా గుర్తించింది. ప్రస్తుతం రుణ మాఫీ కోసం ఖర్చు చేయబోయే మొత్తం సుమారు రూ. 6,800 కోట్లు గా బీఆర్‌ఎస్ వెల్లడించింది.
దీంతోవానాకాలం రైతు బంధు ఇవ్వకుండా ఆ నిధులే రుణ మాఫీ కోసం ఖర్చు చేస్తున్నారని రైతుల నుండి విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించినట్లు లక్ష లోపు రుణాలు మాఫీ చేయడానికి రూ.19,198 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసిన దాంట్లో రైతుల ఖాతాలో వేసిన సొమ్ము రూ. 12 వేల కోట్లు పోగా మిగిలిన రూ. 7 వేల కోట్ల నిధులు ఇప్పుడు ఇస్తున్నట్లుగా కనిపిస్తుందని బీఆర్‌ఎస్ పార్టీ చెబుతోంది.