ఫార్ములా-ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా-ఈ కేసు విషయంలో ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంపై హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్.
ఇవాళ మధ్యాహ్నం 2:15 గంటలకు జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు విచారణకు రానుంది ఫార్ములా-ఈ కేసు. ఇక అటు తెలంగాణ భవన్ కు భారీగా పోలీసులు వస్తున్నారు. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ ఏ క్షణమైనా కేటీఆర్‌ను అరెస్టు చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంత పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా జరుగుతోంది.