రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన లో ఏకంగా 7 గురు సజీవ దహనం అయ్యారట. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
హైవేపై ఓ ఎల్‌పీజీ ట్యాంకర్‌ను ఢీకొట్టింది ట్రక్..దీంతో భారీగా ఎగిసిపడ్డాయి మంటలు. ట్రక్కు… ఇతర వాహనాలను ఢీకొనడంతో పెట్రోల్ పంపు సమీపంలో ఆగి ఉన్న సిఎన్‌జి ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి. అజ్మీర్ రోడ్డులో తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7 గురు మృతి చెందగా.. 24 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గుర్తుపట్టలేనంతగా 7 గురు కాలిపోయారు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదం జరుగగానే…. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి.. మంటలు ఆర్పారు.
రాజస్థాన్ – జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం
హైవేపై ఓ ఎల్‌పీజీ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రక్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు
ఘటనలో ఐదుగురు మృతి.. 24 మందికి తీవ్ర గాయాలు
గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఐదుగురు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం pic.twitter.com/MRCeylCYUc
— Telugu Scribe (@TeluguScribe) December 20, 2024