సీఎం రేవంత్ సోదరున్ని అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు

-

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కాన్వాయ్ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆయన కామారెడ్డికి వెళ్లిన సమయంలో 15కుపైగా వాహనాలతో కాన్వాయ్, పోలీసు భద్రత కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతిరెడ్డిని అడ్డుకున్నారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.

నేడు కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన వేదికపై కూర్చున్న సీఎం రేవంత్ సోదరున్ని బిఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఏ హోదా లేకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటుగా వేదికపై కూర్చున్నారు రేవంత్ సోదరుడు. దీంతో ఏ హోదాలో వేదికపై కూర్చున్నారని తిరుపతిరెడ్డిని ప్రశ్నించి, అడ్డుకొని నిరసన తెలియజేశారు దౌల్తాబాద్ జెడ్పిటిసి కోట్ల మహిపాల్ ముదిరాజ్, ఎంపీపీ పటేల్ విజయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version