BRS MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఫామ్ హౌస్ కేసులో వివరణ ఇచ్చారు BRS MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. మొయినాబాద్ పోలీసులకు న్యాయవాది తో వివరణ ఇచ్చారు MLC పోచంపల్లి. కోడి పందేలు ఆడించిన ఫామ్ హౌస్ తనదేనని, 2023లో వర్రా రమేష్ కుమార్ రెడ్డి కి లీజ్ కి ఇచ్చినట్లు పేర్కొన్నట్లు BRS MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

రమేష్ కుమార్ తో పాటు మరొకరి లీజ్ కి ఇచ్చినట్లు పేర్కొన్నారట BRS MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. లీజ్ పత్రాలను కూడా పోలీసులకు అందజేశారట పోచంపల్లి. లీజ్ కి ఇచ్చిన భూమిని ఏపీ కి చెందిన వ్యాపారి భూపతి రాజు శివ కుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ తీసుకున్నట్లు లేక లో పేర్కొన్నారట BRS MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. కోడి పందాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు పోచంపల్లి.