మీర్‌పేట్ మర్డర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బలమైన ఆధారాలను వెతికేందుకు.. అత్యాధునిక ‘బ్లూ-రే’ టెక్నాలజీ వినియోగించారు పోలీసులు. ఈ టెక్నాలజీతో ఇంట్లో తనిఖీలు నిర్వహించగా.. మాంసం, రక్తం ఆనవాళ్లు లభ్యమైనట్లు తెలిపారు అధికారులు. ఇక ఈ సంఘటనపై ఇంకా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా… ఈ కేసు లో మాధవి చనిపోయిన తర్వాత డెడ్‌బాడీని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లిన గురుమూర్తి.. బాత్రూమ్‌లో డెడ్‌బాడీని ముక్కలు ముక్కులుగా కట్ చేసాడు. ఆ తర్వాత ఒక్కొక్క ముక్కని కమర్షియల్ గ్యాస్ స్టౌవ్ పై పెట్టి కాల్చేసిన గురుమూర్తి.. బాగా కాలిపోయిన ఎముకలను రోట్లో వేసి పొడిగిగా తయారు చేసాడు. ఆ తర్వాత ఆ ఎముకల పొడి మొత్తాన్ని బక్కెట్‌లో నింపి చెరువులో పడేసాడు గురుమూర్తి.