బీఆర్ఎస్ అంటే బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ అంటే బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ అని.. వాళ్ల ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. వాళ్లు ఢిల్లీ వచ్చేది కవితను కలిసేందుకు మాత్రమేనని.. బెయిల్ ప్రభుత్వం చేతిలో ఉంటే లా ఎందుకు..? కోర్టులు ఎందుకు అని సీరియస్ అయ్యారు బండి సంజయ్.

కేసీఆర్ ను లోపల వేయకపోతే కాంగ్రెస్ కి గడ్డు కాలం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అలా జరుగకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. అది అందరికీ తెలిసాక రెండు పార్టీలు కలిసి మాపై యుద్దానికి వస్తారని తెలిపారు.  కాంగ్రెస్ అధికారంలో ఉండాలనేది కోరుకుంటున్నాం. వాళ్లు అధికారంలో ఉంటారా లేదా అనేది వాళ్లు తేల్చుకుంటారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే యూరప్ కాకుండా బంగ్లాదేశ్ కి పంపాలని ఎద్దేవా చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version