తెలంగాణ 70 కి పైగా సీట్లు సాధిస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ శాసనసభకు గురువారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ముఖ్యంగా 2018లోనూ ఎగ్జిట్‌పోల్స్ ఇలాంటి ఫలితాలనే ఇచ్చారని, 5 ఎగ్జిట్‌పోల్స్‌లో ఒక్కటి మాత్రమే కరెక్ట్ అని, మిగిలిన నాలుగు తప్పేనని స్పష్టం చేశారు కేటీఆర్.
2018లో బీఆర్‌ఎస్‌కు 48 సీట్లు వస్తాయని ఒక ఎగ్జిట్‌పోల్ చెప్తే, 50 సీట్లు గెలుస్తారని మరొకరు, 52 వస్తాయని ఇంకొకరు, 66 సీట్లు వస్తాయని వేరొకరు చెప్పారని, అవన్నీ తప్పయ్యాయని గుర్తు చేశారు. అప్పట్లో ఎగ్జిట్‌పోల్స్ తప్పని నిరూపిస్తూ బీఆర్‌ఎస్‌కు 88 సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ 69-72 స్థానాల్లో విజయం సాధిస్తుందని తనకు కూడా ఒకరు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు పంపారని, తాను దాన్ని కూడా అంగీకరించనని కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ..బీఆర్ఎస్ 88 సీట్లు వస్తాయని భావించామని.. వేర్వేరు కారణాలవల్ల 70కి పైగా స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.