తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా చెప్పినట్లుగానే.. ఉదయం 11.30 గంటలకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. గవర్నర్ తమిళి సై.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శలు చేశారు. అయితే…తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. నేటి అసెంబ్లీకి దూరంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉంటున్నారు. బడ్జెట్ రోజు అసెంబ్లీ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అయ్యే అవకాశం ఉంది.