హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్.. ఇవాళ, రేపు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

-

హైదరాబాద్‌ మహా నగర ప్రయాణికులకు బిగ్ అలర్ట్. జంట నగరాల్లో తిరిగే ఎంఎంటీఎస్‌ సర్వీసులను రెండు రోజులు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.. ఈ రోజు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేసారు అధికారులు. సికింద్రాబాద్ అల్లర్ల నేపథ్యంలోనే జంట నగరాల్లో తిరిగే ఎంఎంటీఎస్‌ సర్వీసులను రెండు రోజులు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే..

కాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం విచారణ కొనసాగుతోంది. ” చలో సికింద్రాబాద్ ” అనే వాట్సప్ గ్రూపు సభ్యులను పోలీసులు గుర్తించారు. ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆర్మీ అభ్యర్థులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు చొరబడి నట్లు గుర్తించారు పోలీసులు. రెండు రోజుల క్రితమే వాట్స్అప్ గ్రూపులు క్రియేట్ చేసి విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version