చిల్లర వ్యూహాలతో మమ్మల్ని భయపెట్టలేరు – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

-

సీఎం రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తమని రాజకీయంగా ఎదుర్కోలేక టిఆర్ఎస్ పార్టీ, కెసిఆర్ ని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసుల డ్రామాలు తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. ఈ మేరకు గురువారం కవిత ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదని అన్నారు. తాము కెసిఆర్ సైనికులమని, పోరాటాలు, ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళమని అన్నారు.

ఇలాంటి కేసులకు బెదరమని పేర్కొన్నారు. “సీఎం రేవంత్ రెడ్డి దయచేసి తెలుసుకోండి.. మీ చిల్లర వ్యూహాలు మమ్మల్ని భయపెట్టలేవు. అవి మా సంకల్పానికి మరింత బలం చేకూరుస్తాయి. పోరాటాలు మాకు కొత్త కాదు. అక్రమ కేసులతో మా గొంతులను నొక్కలేరు. జై తెలంగాణ, జై జై తెలంగాణ” అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version