నార్సింగీ ఔటర్ రింగ్ రోడ్డు పై కారు బీభత్సం

-

నార్సింగీ ఔటర్ రింగ్ రోడ్డు పై కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో డివైడర్‌ను ఢీ కొట్టింది. పల్టీలు కొట్టుకుంటూ ఇవతల రోడ్డు పైకి దూసుకువచ్చి టాటా సఫారి కారు ను ఢీ కొట్టింది. దింతో క్యాబ్‌లో ప్రయాణిస్తున్న డ్రైవర్ మృతి చెందాడు. టాటా సఫారి కారులో ప్రయాణిస్తున్న 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి గచ్చిబౌలి వెళుతున్న టాటా జైలో కారు నార్సింగీ వద్దకు రాగానే మితిమీరిన అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది.

Car accident on Narsingi Outer Ring Road

గచ్చిబౌలి నుండి ఎయిర్ పోర్ట్ వైపు తమ‌ రూట్లో వెళుతున్న టాటా సఫారీ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. దింతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగీ పోలీసులు. మృతి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజేంద్రనగర్ శివరాంపల్లి కి చెందిన ఆనంద్ కాంబ్లీగా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version