కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నో పథకాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కేవలం ప్రజల అభివృద్ధికి మాత్రమే కాకుండా కొన్ని పథకాల ద్వారా గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు. వాటిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా రహదారులు లేని గ్రామాలకు రహదారిని నిర్మించే విధంగా దీనిని తీసుకురావడం జరిగింది. కేవలం రహదారులు మాత్రమే కాకుండా క్రాస్ డ్రైనేజీ నిర్మాణం వంటి ఇతర అనుకూలమైన అందుబాటులను కూడా ఇస్తున్నారు. దీంతో రోడ్డు పనుల నాణ్యత కూడా ఎక్కువ అయింది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ పథకం తో గ్రామీణ ప్రజలు ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి ఎన్నో ఇతర సామాజిక సంక్షేమ పథకాలను పొందడానికి సహాయం చేస్తోంది.
అర్హత వివరాలు:
ఈ పథకం ద్వారా ప్రయోజనాలను పొందాలంటే అధికారికంగా ప్రకటించిన జనాభా పరిమాణం మరియు కనెక్టివిటీ స్థితి పై ఆధారపడి ఉంటుంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో 500 లేక అంతకంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు ఇతర ప్రదేశాలకు కనెక్ట్ అయి ఉండకపోతే అటువంటి ప్రాంతాల వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వారు వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన వారు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే విధానం:
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ఏజెన్సీల ద్వారా అమలు చేయబడుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వాలు లేక కేంద్ర పాలిట ప్రాంతాలకు సంబంధించిన కార్యనిర్వాహక సంస్థలలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. జిల్లా స్థాయిలో అయితే ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ యూనిట్స్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తారు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలకు నిధులను ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఈ పథకంలో భాగంగా గ్రామీణ లేక గిరిజన ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానంగా రహదారులను నిర్మించడం, రైతులకు లేక ఇతర కార్మికులకు ఉపాధి అవకాశాలను కల్పించడం వంటివి చేస్తారు. ఈ విధమైన కార్యక్రమాలతో పాటుగా గ్రామీణ ప్రజలకు ప్రభుత్వం అందించేటువంటి సేవలు అందే విధంగా చూస్తారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది.