పరమ పావన రూపం
లక్ష్యం నిర్దేశిస్తుంది
మనిషి తన నుంచి తాను
వేరుపడి భగవత్ దర్శనంలో
లీనం అయి ఉన్నాడా
లేదా తనని తాను తెలుసుకుని
పరమాత్మ రూపాన్ని దర్శించాడా?
ఇన్ని వేల ఏళ్ల తరువాత
సమానత్వ సూచికల్లో మనం ఎక్కడో ఆగిపోయాం
స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏం నేర్పనుందో?
ఉదయం టీ తాగుతూ తాగుతూ మా ఊళ్లో అంటే శ్రీకాకుళంలో ఓ పెద్ద హోర్డింగ్ చూశాను.అల్లంత దూరాన నడి నెత్తిన ఉన్న ఆ హోర్డింగ్ చూశాక కొన్ని సందేహాలు వచ్చేయి. చినజియరు స్వామి చిద్విలాసంతో పాటు రామానుజ మూర్తి విగ్రహ రూపం ఒకటి కనిపించి ఆనందంతోపాటు ఆశ్చర్యం ఏక కాలంలో పుట్టేయి.ఆ విధంగా మనుషుల మధ్య ఉన్న అంతరాల తొలగింపునకు..తొలగి పోయాయి అని అనేందుకు మరియు చెప్పేందుకు,విశదీకరించేందుకు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అన్నది మరో కొండ గుర్తు రేపటి వేళ కానుందా అని కూడా అనిపించింది. మనుషుల్లో అవి సాధ్యం అయ్యే నాటికి మరో వెయ్యేళ్లు కూడా చాలక పోవచ్చు.విశిష్టాద్వైత భావాలు ఇంకా ప్రచారానికి నోచుకుంటూనే ఉంటాయి అప్పటికీ!
వెయ్యి కోట్లకు పైగా వెచ్చించి నిర్మించిన ఆలయం నుంచి సమానత్వం..ఆలయంలో సమానత్వం..ఆలయం ఎదుట పైన ఆకాశాన దిగువ భూమిలో సమానత్వ వీచికలు పొందడం సులువు అయిన పని కాదు. కోట్ల కాంతులను ఓ చోట చేర్చినంత సులువు అస్సలు కాదు. నక్షత్ర మండలాలను వీక్షిచింనంత సులువు అంత కన్నా కాదు. నేల పొరల్లో దాగిపోయిన ధాతువుల వెలికి తీత
అన్నది సులువు కూడా కాదు. కనుక మనుషులు ఇంకొంత కాలం సమానత్వం,ఏకత్వం అన్నవి సాధించేందుకు ఇంకొంత కృషి చేయాలి. ఆ కృషి మనుషులు చేయాలి కానీ విగ్రహాలు చేయవు. విగ్రహాలు ఓ ఆలోచనకు ప్రేరణ. ఓఆలోచనకు ఆచరణకు మధ్య సంధి సమయంలో తారసిల్లే రూపాలు కొన్ని మంచి పనులు చేయిస్తాయి. ఆవిధంగా సమత కు సంకేతిక ఆ విగ్రహం ఆ రూపం.
– హోర్డింగ్ కబుర్లు – మన లోకం ప్రత్యేకం