బీఆర్‌ఎస్‌ కు షాక్‌…హరీష్‌ రావుపై పంజాగుట్టలో కేసు నమోదు

-

బీఆర్‌ఎస్‌ కు షాక్‌…మాజీ మంత్రి హరీష్‌ రావుపై కేసు నమోదు అయింది. మాజీ మంత్రి హరీష్‌ రావుపై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు కావడం జరిగింది. బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్‌ ఫిర్యాదుతో మాజీ మంత్రి హరీష్‌ రావుపై కేసు నమోదు చేసారు పోలీసులు. మాజీ మంత్రి హరీష్‌ రావుతో పాటు మరికొందరు వ్యక్తులపై కూడా కేసులు పెట్టారు పోలీసులు.

chakradhara goud police case on harish rao

టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై కూడా పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు కావడం జరిగింది. మాజీ మంత్రి హరీష్‌ రావు, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై 120 (b), 386, 409, ఐటీ యాక్ట్ 2008 కింద కేసులు నమోదు అయింది. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్‌ ఆరోపణలు చేస్తున్నారు. తన ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్న బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్‌… పంజాగుట్ట పీఎస్ లో కేసు పెట్టారు. దీంతో మాజీ మంత్రి హరీష్‌ రావుపై కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version